ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను సైతం అలవోకగా బద్దలు కొడుతూ తాను కూడా ఒక దిగ్గజ క్రికెటర్ అని చెప్పకనే చెప్పాడు. అయితే విరాట్ కోహ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో కాస్త బొద్దుగా లవర్ బాయ్ లాగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎక్కువ దృష్టి సారించాడో ఇక అతని కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కేవలం ఆట తీరులో మాత్రమే కాదు ఫిట్నెస్ విషయంలో కూడా విరాట్ కోహ్లీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇక ప్రస్తుతం కోహ్లీ ఫిట్నెస్ గురించి క్రికెట్ ప్రేక్షకులను ఎవరిని అడిగినా కూడా పూర్తిగా వివరంగా చెబుతూ ఉంటారు అని చెప్పాలి . పరుగులు యంత్రంగా పేరు సంపాదించుకొని భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో కూడా మరోసారి హాట్ ఆఫ్రికా మారిపోయాడు. 2021- 22 సంవత్సరంలో ఒక్కసారి కూడా గాయం బారిన పడి నేషనల్ క్రికెట్ అకాడమీ గడప తొక్కని ఏకైక క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక అతని 14 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఫిట్నెస్ లేమీ కారణంగా దూరమైన మ్యాచులు కేవలం నాలుగు మాత్రమే అంటూ ఇటీవల బీసీసీఐ తెలిపింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి