కాగా నేటి నుంచి అటు వరల్డ్ కప్ ప్రారంభం కాగా నేడు మొదటి మ్యాచ్లో శ్రీలంక- నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎవరైనా సరే పసికున నమీబియా పై అటు శ్రీలంక జట్టు ఎంతో అలవోకగా విజయం సాధిస్తుంది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మ్యాచ్లో పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించి ఇక వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డ్స్ సృష్టిస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్లో మాత్రం అందరూ ఊహించింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి.
ఇలా ప్రపంచకప్ తొలి మ్యాచ్ లోనే సంచలనం నమోదయింది అని చెప్పాలి. శ్రీలంక జట్టుపై పసికూన నమీబియా ఏకంగా 55 పరుగులతో ఘనవిజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు నిర్మిత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దింపిన శ్రీలంక జట్టు 108 పరుగులకు కుప్పకూలిపోయింది అని చెప్పాలి. దీంతో 50 పరుగుల తేడాతో అటు శ్రీలంక జట్టుపై పసికూన నమీబియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. నమీబియా విజయం సాధించడంతో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. మొదటి మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా మారిందని కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి