అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి . ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను ఎంతో అలవోకగా చేదిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.  ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక నేటితరం క్రికెటర్లతో పోల్చి చూస్తే ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు కోహ్లీ. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ బ్యాటింగ్ తో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కఠిన పరిస్థితుల మధ్య టీమ్ ఇండియాను గెలిపించాడు. ఏకంగా 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు.


 విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండడం గమనార్హం. ఇక తన వీరోచితమైన ఇన్నింగ్స్ తో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల మనసులు కొలగొట్టాడు విరాట్ కోహ్లీ. అదే సమయంలో ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆడి రోజులు గడుస్తున్న కోహ్లీ సాధించిన ఒక్కో రికార్డు గురించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న ఆటగాడిగా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చిన కోహ్లీ.. ఇక ఇప్పుడు భారత కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.


 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రావిడను వెనక్కి నెట్టి ఆరవ స్థానానికి ఎగబాకాడు విరాట్ కోహ్లీ. విరాట్ మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచుల్లో 53.80 సగటుతో 24,212 పరుగులు చేశాడు. ఇందులో 71 సెంచరీలు 126 హాప్ సెంచరీలు ఉన్నాయి. ఇక రాహుల్ ద్రావి 509 ఇన్నింగ్స్ లలో 45. 41 సగటుతో 24,208 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక దిగ్గజం కుమార సంగకర 28,016, ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ 27,483,  జయవర్ధనే 25, 857, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ జాక్ కలీస్ 25,534 రన్స్ తో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: