అయినప్పటికీ మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో అటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే తనదైన బ్యాటింగ్ తీరుతో మిస్టర్ ఐపీఎల్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇక ఇటీవల సురేష్ రైనా అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సురేష్ రైనాను కామెంటేటర్ గా చూడవచ్చు అని అభిమానులు అందరూ భావించారు. కానీ మరోసారి క్రికెటర్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు సురేష్ రైనా. భారత క్రికెట్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న క్రికెటర్ ఇతర దేశాల లీగ్లలో ఆడేందుకు రూల్స్ ప్రకారం అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా ఇక ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. అబూదాభి టీ20 లీగ్ లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడెందుకు సురేష్ రైనా ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది నవంబర్ 23వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభం కాబోతుంది అనిచెప్పాలి. అయితే గత రెండేళ్ల నుంచి బ్యాటింగ్కు దూరంగా ఉన్న సురేష్ రైనా మరోసారి మైదానంలోకి దిగి సత్తా చాటెందుకు సిద్ధమవుతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి