ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే ఒక ఆటగాడి గురించి చర్చించుకుంటుంది. అతను ఎవరో కాదు సూర్య కుమార్ యాదవ్. 360 డిగ్రీస్ ప్లేయర్ అనే పదానికి అసలైన అర్ధాన్ని ఇస్తున్న సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టి20 ఫార్మాట్లో తన బ్యాటింగ్ తో వీర విహారం చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. అంతేకాదు తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో మాజీ ఆటగాళ్లు అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసేస్తూ  వున్నాడు అని చెప్పాలి. భారత జట్టులోకి మూడు పదుల వయసులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ వచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 ప్రస్తుతం భారత జట్టులో నాలుగవ స్థానంలో నమ్మదగిన ఆటగాడిగా మారిపోయిన సూర్య కుమార్ యాదవ్ జట్టులోకి వచ్చి ఏడాది తిరగకుండానే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. మొన్నటికీ మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్కప్ లో విజృంభించిన సూర్య కుమార్ యాదవ్... ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్లో సైతం 51 బంతుల్లోనే సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు ప్రతి ఒక్కరు. ఇక ఇటీవల సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం పై స్పందించిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిలకడైన ఆటకు మారుపేరుగా మారిన సూర్యకుమార్ మాకు తలనొప్పి  తెప్పిస్తున్నాడు. ఆస్ట్రేలియా కాదు ప్రపంచంలోనే ఇప్పుడు తన దరిదాపుల్లోనే వెళ్లే ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో తన ప్రదర్శనతో ఒక్కోసారి బట్లర్ సూర్య కుమార్ యాదవ్ తో పోటీ పడగలడు అంటూ చెప్పుకొచ్చాడు మాక్స్వెల్. అంతలోనే బిగ్ బాష్ లీగ్ ప్రస్తావన రావడంతో మా దగ్గర సూర్యకుమార్ను కొనగలిగే అంత   డబ్బు లేదు.  ఒకవేళ తనను సొంతం చేసుకోవాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఆటగాడు సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లను తొలగించాల్సి వస్తుందేమో. అందరి జీతం కట్ చేస్తే అప్పుడైనా అతని కొనగలుగే స్తోమత వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: