ఐపీఎల్ ద్వారా టీం ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్న యువ ఆటగాళ్లలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియా జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు స్పిన్ బౌలింగ్ తో మరోవైపు తన బ్యాటింగ్ తో కూడా అందరీ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇలా ఎన్నోసార్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి.


 చాలా రోజుల తర్వాత టీమిండియా జట్టులో చోటు సంపాదించుకున్న వాషింగ్టన్ సుందర్ ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో సంజు శాంసన్ వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చాడు. అయితే అప్పటికే మరోవైపున శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో ఉండడంతో వాషింగ్టన్ సుందర్ అతనికి స్ట్రైక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో బ్యాటింగ్ లో విరుచుకుపడిన వాషింగ్టన్ సుందర్ సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. ఏకంగా 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు.


 వాషింగ్టన్ సుందర్ ఏంటి ఇలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇలా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్ ఒక అరుదైన రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. 12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేసాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30కి పైగా ఎక్కువ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్ గా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు అని చెప్పాలి. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. 2009లో న్యూజిలాండ్ పై 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు సురేష్ రైనా.  ఇక ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: