సాధారణంగా సినీ సెలబ్రెటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ ఫాలోయింగ్ కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లలో ఉత్సాహాన్ని నింపితే మరికొన్ని సార్లు మాత్రం ఏకంగా తమపై వచ్చే ట్రోల్స్ చూసి విరక్తి పుట్టేలా చేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు.. ఎవరైనా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు అంటే.. ఇక వారిపై క్రికెట్ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ట్రోల్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు.


 ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇలా ఎవరైనా ఆటగాడు పేలవ ప్రదర్శన చేశాడు అంటే చాలు అందుకు సంబంధించి ఎన్నో మీమ్స్, ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి మీమ్స్ కొన్నిసార్లు ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంటే.. కొన్ని మాత్రం అందరూ నవ్వుకునేలా ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇటీవలే పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్లోనే విధ్వంసం సృష్టించింది అని చెప్పాలి.


 టి20 ఫార్మట్ తరహా లోని సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తమది వరల్డ్ లోనే ఎంతో పటిష్టమైన  బెస్ట్ బౌలింగ్ అని చెప్పుకునే పాకిస్తాన్ ప్లేయర్లు ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ల విధ్వంసం ముందు చేతులెత్తేయడంతో ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఒక ట్రోల్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టెస్ట్ క్రికెట్ అన్నారు కానీ వాళ్ళు ఏమో టి20 క్రికెట్ ఆడుతున్నారేంటి అని ఆశ్చర్యపోయిన ఒక మీమ్ అందరిని నవ్విస్తుంది. కాగా 75 ఓవర్లలోనే 506 పరుగులు చేశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: