వెస్టిండీస్ విధ్వంసకర  ఆటగాడు అయినా కీరాన్ పొలార్డ్  తన అద్భుతమైన ప్రదర్శనతో ఎంతలా అదరగొడుతూ ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా వెస్టిండీస్ జట్టులో మాత్రమే కాదు అటు ఐపిఎల్ ముంబై ఇండియన్స్ జట్టు తరఫున కూడా తన అద్భుతమైన ప్రదర్శనతో భారత ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గర అయ్యాడు అని చెప్పాలి. ఒకసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే చాలు ఏకంగా సిక్సార్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు కీరాన్ పొలార్డ్. ఇక బౌలర్లపై వీరవిహారం చేస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉంటాడు.


 ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నోసార్లు ఓడిపోయే మ్యాచ్లను సైతం తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఒంటి చేత్తో విజయాన్ని అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి.ఇకపోతే ఇటీ ఇటీవల   పొలార్డ్ ఇక ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక ఆ జట్టు అతని వదులుకోలేక బ్యాటింగ్ కోచ్గా కూడా అవకాశం కల్పించింది. ఇకపోతే ఇలాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్  కిరాన్ పోలార్డ్ ఇక ఇటీవల మరోసారి తనని బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించాడు.


 అబుదాబి టి10 లీగ్ లో అదరగొట్టాడు కీరాన్ పొలార్డ్. న్యూయార్క్  స్ట్రైకర్స్ తరఫున ప్రాతినిధ్యం భావిస్తున్న కీరాన్ పొలార్డ్ ఢిల్లీ బుల్స్ కు చుక్కలు చూపించాడు. ఆఖరి ఓవర్ లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. బ్రావో బౌలింగ్ వేసాడు. అయితే పొలార్డ్ మొదటి నాలుగు బంతుల లోనే రెండు సిక్సర్లు రెండు ఫోర్లు బాధి సంచలన విజయాన్ని అందించాడు అని చెప్పాలి. తొలిత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 112 పరుగులు చేస్తే.. ఆ తర్వాత న్యూయార్క్ స్త్రైకర్స్ మాత్రం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఇక అతని బ్యాటింగ్ విధ్వంసం చూసి ఇంకోన్నాళ్ళు ఐపీఎల్లో కొనసాగి ఉంటే బాగుండేది అని ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: