ప్రస్తుతం భారత జట్టు వరుసగా సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  మొన్నటికి మొన్న న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ తో పాటు వన్ డే సిరీస్ కూడా ఆడింది టీం ఇండియా జట్టు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు కూడా గడవకముందే.. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనకు పయనం అయింది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఆడబోతుంది. ఇది ముగిసిన వెంటనే మళ్ళీ కొత్త ఏడాదిలో కూడా వరుస సిరీస్ లకు సిద్ధమవుతుంది టీమిండియా.


 ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు వరకు జట్టులో ఎవరు ఎలాంటి ఫామ్ లో ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా జట్టులో వచ్చే ఏడాది టెస్ట్ సిరీస్ జట్టులో చోటు సంపాదించుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మిచేల్ మార్ష్ చివరికి జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.


 ఎందుకంటే ఎడమ చీలిమండ గాయంతో బాధపడుతూ ఉన్నాడు మీచెల్ మార్ష్.. త్వరలో శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నాడట. ఈ క్రమంలోనే ఈ సర్జరీ అనంతరం కనీసం మూడు నెలల పాటు అతడు అరెస్టు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందట. తద్వారా ఇక క్రికెట్కు దూరం కాబోతున్నాడట. అయితే మార్చిలో భారత్తో జరిగే వన్డే సిరీస్ నాటికి మిచెల్ మార్ష్ కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇటీవల టీ20 వరల్డ్ కప్ తో పాటు ఇంగ్లాండ్ తో సిరీస్ లో కూడిన ఆడిన మిచెల్ మార్ష్ ప్రదర్శన చేశారు.  ఇకపోతే ఇటీవలే అతన్ని వెస్టిండీస్ తో టెస్టులకు కూడా ఎంపిక చేయలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: