విరాట్ కోహ్లీ .. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలిపించలేకపోయాడు అన్న కారణంతో గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు గుప్పించారు భారత అభిమానులు. దీంతో వెంటనే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ డిమాండ్ చేశారనో.. లేకపోతే ఇంకేదైనా కారణంతోనో తెలియదు కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత సూపర్ సక్సెస్ కెప్టెన్ గా పేరు గాంచిన రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలను అప్పగించింది బీసీసీఏ. దీంతో ఇక అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియా అద్భుతంగా రాణిస్తుందని అందరూ అనుకున్నారు.


 ఇక అనుకున్నట్లుగానే తన సారాధ్య వ్యూహాలతో టీమ్ ఇండియాకు వరుసగా విజయాలను అందించాడు రోహిత్ శర్మ. కానీ ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో మాత్రం పేలువ ప్రదర్శనతో నిరాశపరిచాడు. కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా కూడా దారుణంగా విఫలమయ్యాడు అని చెప్పాలి. ఇప్పుడు కూడా అటు ద్వైపాక్షిక సిరీస్లలో ఎందుకో మునుపటిలా తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేయలేకపోతున్నాడు రోహిత్ శర్మ. ఇకపోతే ఇటీవల అటు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా రోహిత్ కెప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.


 బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో పరిస్థితులు మొత్తం భారత్కు అనుకూలంగా ఉండడంతో మనదే విజయం అని అనుకున్నారు భారత అభిమానులు. కానీ గెలుస్తుందనుకున్న మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్సీ వ్యూహాల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లను వినియోగించుకోవడంలో రోహిత్ ఫెయిల్ అవుతున్నాడని.. అదే సమయంలో ఇక సహచర ఆటగాళ్లతో ఎంతో కూల్ గా ఉండకుండా.. విచక్షణ కోల్పోయి అరుస్తున్నాడని.. బాగా బౌలింగ్ చేసే సుందర్,షాదాబ్ కి ఓవర్లు మిగిలి ఉన్న వాళ్ళకి బౌలింగ్ ఇవ్వకుండా తప్పుడు చేసాడని ఏకీపారేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: