ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ప్రస్తుతం గా జరుగుతుంది అని చెప్పాలి . ఇక ప్రతి జట్టు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా హోరా హోరిగా జరుగుతుంది అని చెప్పాలి. ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతుంది. అదే సమయంలో ఇక ప్రేక్షకులు ఊహించినట్లుగానే ఫిఫా వరల్డ్ కప్ లో ఆయా జట్లలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది తమదైన ఆట తీరతో మరోసారి ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం సాకర్ దిగ్గజంగా కొనసాగుతున్న అర్జెంటినా స్టార్ ప్లేయర్ మెస్సి ఇప్పటివరకు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు.


 జట్టును గెలిపించడానికి తనదైన శైలిలో గోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే మెస్సి ఇక తన రికార్డులతో కూడా ఇతర ఆటగాళ్లను వెనక్కి నెట్టి దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే అర్జెంటీనా స్టార్ ఫుడ్ బాల్ ప్లేయర్ మెస్సి మరో అరుదైన ఘనత సాధించాడు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్లో ఆడటం ద్వారా కెరియర్ లో వెయ్యి మ్యాచ్లను పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. మొత్తంగా అతని కెరియర్ లో 789 గోల్స్ చేశాడు. ఇక అదే సమయంలో 348 గోల్స్ కి సహకరించాడు లియోనాల్ మెస్సి.


 ఇక అతని కెరియర్లో 41 ట్రోఫీలను సాధించడం గమనార్హం. ఇక మరోవైపు పోర్చుగల్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న క్రిస్టియానో రోనాల్డో ఏడాది కిందటే 1000 మ్యాచ్లను పూర్తి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా మొత్తంగా అతని కెరియర్ లో 725 గోల్స్ చేశాడు. 216 గోల్స్ చేసేందుకు సహకరించాడు అని చెప్పాలి. ఇక అతని ఖాతాలో 31 ట్రోఫీలు ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో లియోనల్ మెస్సి ఒక అరుదైన ఘనత సాధించడం పై అటు అభిమానులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: