తాజాగా జరిగిన ఫిఫా వరల్డ్  స్పోర్ట్స్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఫ్రాన్స్ ఇంకా అర్జెంటీనా రెండు టీంలు కూడా చాలా అద్భుతంగా ఆడాయి. ఫైనల్ గా అర్జెంటీనా  టీం గెలిచింది. ఆ కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ తన చిరకాల కోరికను ఈ వరల్డ్ కప్ తో నెరవేర్చుకున్నాడు.వరల్డ్‌కప్‌ గెలవాలన్న తన కోరిక ఇంకా కల మొత్తానికి నిజమైంది. ఫిఫా వరల్డ్‌కప్‌ 2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను  4-2తో ఓడించిన అర్జెంటీనా టీం విజేతగా నిలిచింది. తన టీమ్‌ను సూపర్ విన్నింగ్ టీం గా నిలిపిన మెస్సీ గోల్డెన్‌ బాల్‌ అవార్డు గెలుచుకున్నాడు.రెండుసార్లు గోల్డెన్‌ బాల్‌ గెలుచుకున్న ఫస్ట్ ప్లేయర్‌గా మెస్సీ హిస్టరీలో నిలిచాడు.మెస్సి కేవలం ఫీల్డ్‌లోని రికార్డులే కాదు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కూడా అతడు సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మెస్సీ చేసిన పోస్ట్‌ను ఇప్పటికే సుమారు 6 కోట్ల మంది లైక్‌ చేయడం రికార్డ్. ఓ స్పోర్ట్స్‌ మ్యాన్ చేసిన పోస్ట్‌కు ఇవే రికార్డు లైక్స్‌.


ఛాంపియన్స్‌ ఆఫ్ ద వరల్డ్‌ అంటూ మెస్సీ చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటి దాకా 6 కోట్ల పైగా లైక్స్‌, 17 లక్షల పైగా కామెంట్స్‌ వచ్చాయి.మెస్సి చేసిన ఈ పోస్ట్‌ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అర్జెంటీనా అభిమానులు అందరూ కూడా మెస్సి పోస్ట్ ని లైక్‌ చేయడం మొదలుపెట్టారు.ఈ పోస్ట్ ఏకంగా ఓ స్పోర్ట్స్‌ పర్సన్‌ పోస్ట్‌కు అత్యధిక లైక్స్‌ వచ్చిన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి దాకా ఈ రికార్డు పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉండేది. ఇక మెస్సీతో కలిసి చెస్‌ ఆడుతున్న ఫొటోను రొనాల్డో షేర్‌ చేయడం జరిగింది. ఆ ఫొటోకు ఏకంగా 4.19 కోట్ల లైక్స్‌ వచ్చాయి.ఇప్పుడు ఆ రికార్డును  దాటేసిన మెస్సీ పోస్ట్‌.. ఇంకా స్పీడ్ గా దూసుకెళ్తూనే ఉంది.ఇక ఫిఫా వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ప్రజెంటేషన్‌ కూడా సోషల్‌ మీడియాలో మోస్ట్‌ ట్రెండింగ్‌ టాపిక్‌గా రికార్డ్ సృష్టించింది.లియో మెస్సీ ఎన్నో ఏళ్ల కల నెరవేరినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: