గత కొంత కాలం నుంచి మంచి ప్రదర్శనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న టీమిండియా మహిళల జట్టు ఇటీవల సొంత గడ్డపై మాత్రం తేలి పోయింది అన్న విషయం తెలిసిందే. పటిష్టమైన ఆస్ట్రేలియా తో సొంత గడ్డపై మ్యాచ్లు ఆడినప్పటికీ ఎక్కడ ప్రభావం చూపలేక పోయింది భారత మహిళల జట్టు. ఇక ఇటీవల ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగం గా ఘోర ఓటమి చవి చూసింది అన్న విషయం తెలిసిందే.


 మొదటి రెండు మ్యాచ్లలో ఓడి పోయి మూడో మ్యాచ్లో విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక నాలుగో మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్ అవకాశాలను సజీవం గా ఉంచుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అందరినీ నిరాశ పరిచింది. నాలుగవ టి20 మ్యాచ్ లో కూడా గెలుపు కోసం చివరి వరకు పోరాడినప్పటికీ చివరికి ఓడిపోయింది భారత మహిళల జట్టు. దీంతో టి20 సిరీస్ కోల్పోయింది అని చెప్పాలి. అయితే కనీసం ఐదవ టి20 మ్యాచ్ లో అయినా భారత మహిళల జట్టు గెలుస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు.


 ఐదవ టి20 మ్యాచ్ నామమాత్రమైనది అయినప్పటికీ ఇక టీమిండియా గెలిస్తే మాత్రం పరువు నిలబెట్టుకుంటుంది అని అందరు భావించారు. కానీ చివరి టీ20 మ్యాచ్ లో కూడా భారత జట్టు ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో 4-1 తేడాతో ఓడిపోయి ఆస్ట్రేలియా కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కాగా చివరి టీ20 మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో గెలిచింది. తొలత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టటానికి 196 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత లక్ష్య  చేదనకు దిగిన భారత జట్టు 142 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఓటమి తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: