టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం నాడు తెల్లవారు జామున చాలా పెద్ద ప్రమాదానికి గురైంది.ఇంకా ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ఘోరంగా ఆక్సిడెంట్ అయ్యి ఆ కార్ పూర్తిగా మంటల్లో కాలిబూడిదైంది. అయితే అదృష్టవశాత్తు పంత్ కి ఏమి కాలేదు. ఎందుకంటే ఈ పెద్ద ప్రమాదం జరగ్గానే రిషబ్ వెంటనే  కారు అద్దాలను బ్రేక్ చేసుకుని బయటపడ్డట్లు అక్కడ ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ భయంకరమైన కార్ యాక్సిడెంట్ లో గాయపడ్డ రిషబ్ పంత్ ను స్థానికుల సహాయంతో పోలీసులు దగ్గర్లో వున్న ఆస్పత్రికి తరలించారు.ఎంతో తీవ్రగాయాల పాలైన పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపడం జరిగింది. అయితే తాజాగా రిషబ్ పంత్ ప్రమాదానికి సంబంధించిన ఈ భారీ ఆక్సిడెంట్ యొక్క సీసీటీవీ ఫుటేజీ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ గా మారింది.


అయితే రిషబ్ పంత్.. తన తల్లితో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని తన స్వస్థలానికి బయలుదేరడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులకు సమాచార ఇవ్వకుండా సర్ప్రైజ్ చేద్దామని రిషబ్ పంత్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతని కారు శుక్రవారం నాడు తెల్లవారు జామున 5.30 గంటలకు యక్సిడెంట్ కు గురైంది. రొడ్డుపక్కన ఉండే రైలింగ్ ను ఢీకొంది ఆ కారు. దాంతో కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ రిషబ్ పంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకి వచ్చింది. ఈ వైరల్ వీడియోలో పంత్ కారు వేగంగా వచ్చి రోడ్డు సైడ్ కు ఉండే రైలింగ్ ను ఢీ కొంటూ వెళ్లిన దృశ్యాలు చాలా ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఆ వీడియోను చూస్తే హాలీవుడ్ రేంజ్ లో యాక్సిడెంట్ జరిగినట్లు చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: