అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అగ్రసీవ్ నెస్ తో కంట్రోల్ కోల్పోయి ఏకంగా ఎంపైర్లను కూడా తిట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటివి ఏదైనా జరిగింది అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల భారత యువ ఆటగాడు దీపక్ హుడా సైతం ఏకంగా ఎంపైర్ ను బూతులు తిట్టడానికి సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదిక వైరల్ గా మారిపోయింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. దీపక్ హుడా అక్షర్ పటేల్‌తో కలిసి ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా 18 ఓవర్లో కాసున్ రజిత ఐదో బంతిని అవుట్ సైడ్ దిశగా వేయగా తొలుత షాట్ ఆడాలనుకున్న దీపక్ హుడా దానిని వదిలేశాడు. ఇక ఈ బంతిని ఎంపైర్ వైడ్ గా ప్రకటిస్తాడు అని భావించాడు. కానీ అలా జరగలేదు అప్పటికే 5 వికెట్లు నష్టానికి 133 పరుగుల వద్ద ఉంది టీమిండియా దీంతో ఒత్తిడిలో ఉన్న దీపక్ హుడా ఎంపైర్ ను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడాడు. అంపైర్‌తో వాదనకు దిగాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసిన ఎంతోమంది నేటిజన్స్ ఇంట్లో అమ్మానాన్న ఇదే నేర్పించారా అంటూ గట్టిగానే ఏకీపారేస్తున్నారు.