2023 ఏడాదిలో వరుసగా సిరీస్ లు గెలుస్తూ టీమ్ ఇండియా జోరు మీద ఉంది అని చెప్పాలి. ఇప్పటికే భారత పర్యటనకు వచ్చిన  శ్రీలంకతో టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా విజయం సాధించింది టీమ్ ఇండియా జట్టు. ఇకపోతే ఇప్పుడు ఇండియా పర్యటనకు వచ్చిన కివీస్ జట్టుతో కూడా వన్డే సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్ లో భాగంగా ఇటీవలే మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ వన్డే మ్యాచ్ లో భాగంగా భారత జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. శుభమన్ గిల్ డబుల్ సెంచరీ తో చెలరేగిపోవడంతో ఏకంగా 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.


 తద్వారా ప్రత్యర్థి  న్యూజిలాండ్ ముందు భారీ స్కోరును పెట్టింది అని చెప్పాలి. అయితే తర్వాత ఇక భారత బౌలర్లు కూడా అదరగొట్టడంతో  తక్కువ పరుగులకే న్యూజిలాండ్ కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కోరుకుపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక టీమిండియా విజయం సాధించినట్లే అని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే టీమిండియా విజయాలకు బ్రేక్  పడేలా కనిపించింది. ఏకంగా టీమ్ ఇండియాకు ఓటమి భయం ఎలా ఉంటుందో చూపించారు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు. కివీస్ బ్యాట్స్మెన్ బ్రెజ్ వెల్ 140 పరుగులతో చెలరేగిపోగా మరోవైపు నుంచి షాంట్నర్  57 పరుగులతో మంచి సహకారం అందించాడు.


 దీంతో భారీ టార్గెట్ ను చేదించి అటు టీమ్ ఇండియాను కివీస్ ఓడిస్తుందేమో అని ఉత్కంఠ చివర్లో నెలకొంది. కానీ మహమ్మద్ సిరాజ్ శాంట్నర్ ను అవుట్ చేయడం... ఇక ఆ తర్వాత బ్రేస్ వెల్ ఒంటరి పోరాటం చేసిన ఎక్కువ పరుగులు రాకపోవడంతో చివరికి 337 పరుగుల వద్ద న్యూజిలాండ్ జట్టు ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. దీంతో భారీగా టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచినప్పటికీ కేవలం 12 పరుగుల తేడాతో మాత్రమే ఇండియా విజయం సాధించింది. దీంతో ఇక న్యూజిలాండ్ జట్టు చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ చివరికి ఓడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: