
చివరిసారిగా 2020 జనవరిలో రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్లో సెంచరీ చేశాడు అని చెప్పాలి. ఇక అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అతని బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు. ఈ క్రమంలోనే ఇటీవల న్యూసిలాండ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన నేపథ్యంలో రోహిత్ శర్మ దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రత్యక్షమయ్యాయి అని చెప్పాలి. అయితే ఇక ఈ వార్తలు అటు రోహిత్ శర్మ కంటపడ్డాయ్. ఇక బ్రాడ్కాస్టర్లు కూడా ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం గమనార్హం. ఇక ఈ విషయంపై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నేను చివరిసారిగా 2020 జనవరిలో వన్డే ఫార్మాట్లో సెంచరీ చేశాను. ఆ తర్వాత టెస్టుల్లో 2021 సెప్టెంబర్ లో సెంచరీ చేశాను. ఈ విషయం పక్కన పెడితే.. బ్రాడ్కాస్టర్లు మూడేళ్ల తర్వాత సెంచరీ చేసానంటూ చెబుతున్నారు. అయితే 2020 - 23 మధ్యకాలంలో నేను ఎన్ని మ్యాచ్ లు ఆడానన్న విషయాన్ని కూడా బ్రాడ్కాస్టర్లు గ్రహిస్తే మంచిది. నేను ఎన్ని మ్యాచ్ లు ఆడాను అన్నది చూపించకుండా 1100 రోజుల తర్వాత సెంచరీ చేశాడు.. మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడంటూ ఊదరగొట్టడం అస్సలు సరికాదు అంటూ ఏకంగా మీడియా సమక్షంలోనే బ్రాడ్కాస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ.