గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా టీ20 ఫార్మాట్ కు వరుసగా కెప్టెన్గా ఎంపిక జట్టును ముందుకు నడిపించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉన్నాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఇక తనదైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తూ సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై అటు సహచర ఆటగాళ్లు మాత్రమే కాదు మాజీ ఆటగాళ్ళు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


 అతను తన ప్రణాళికలతో జట్టును ముందుకు నడిపిస్తున్న తీరు అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తెస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు హార్దిక్ పాండ్యా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం కూడా విమర్శలకు తావిస్తూ ఉంది అని చెప్పాలి. న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి 20 మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తున్న చాహల్ కి బదులు దీపక్ హుడాతో హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయించాడు. అయితే ఇక ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్.


 అప్పటికి మంచి టచ్ లో కనిపించిన చాహల్ తో రెండు ఓవర్లే బౌలింగ్ చేయించడం సరైన నిర్ణయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. చాహల్ 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసినప్పటికీ న్యూజిలాండ్ జట్టులో కీలక ప్లేయర్గా ఉన్నాయి ఫిన్ అలేన్ వికెట్ పడగొట్టి 2 ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఇలా అద్భుతమైన ఫామ్ చూపిస్తున్న ఛాహల్ తో రెండు ఓవర్లే బౌలింగ్ చేయించడం ఏంటి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు గంభీర్. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడం తప్పు కాదు. కానీ చాహల్ కు కనీసం ఆఖరి ఓవర్ అయినా బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక హార్దిక్ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: