రంజీ ట్రోఫీ చరిత్రలో ప్రస్తుతం ఎంతోమంది ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే  ఆంధ్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సీనియర్ ప్లేయర్ హనుమ విహారి సైతం తన వీరోచితమైన పోరాటంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాల నమోదు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇటీవల మధ్యప్రదేశ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లోను అదే జోరును కొనసాగిస్తుంది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్లో హనుమ విహారి తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో తన వీరోచిత పోరాటంతో ఏకంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు అని చెప్పాలి. రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్ ఆఖరిలో హనుమ విహారి చేతికి గాయమైంది. ఇక అలాంటి సమయంలో ఏ ఆటగాడు అయినా సరే బ్యాటింగ్ చేయడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏమాత్రం అటూ ఇటూ గా మారినా కూడా ఏకంగా కెరియర్ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కానీ హనుమ విహారి మాత్రం ఇక తన జట్టును గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు.


 ఇక ఎప్పుడూ కుడివైపు నుంచి బ్యాటింగ్ చేసే హనుమ విహారి ఇక చేతి గాయం కారణంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. ఇక కొన్ని కొన్ని సార్లు వంటి చేత్తో కూడా బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి. ఇక  57 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక హనుమ విహారి చేసిన వీరోచిత పోరాటం మాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు ప్రత్యర్థి జట్టు ఫ్యాన్స్ సైతం అతని పోరాటానికి ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే హనుమ విహారి మనికట్టు ఫ్రాక్చర్ ను సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగి బ్యాటింగ్ చేసిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ఫ్యాన్స్ గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: