భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అంటే చాలు పోరు ఎంత హోరాహోరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం ఆట విషయంలోనే కాదు ఇక మాటల యుద్ధం కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరుగుతూ ఉంటుంది. సాధారణంగానే ఆస్ట్రేలియా జట్టు స్లెడ్జింగ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా స్లెడ్జింగ్ కు పాల్పడిన సమయంలో అటు భారత ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు గట్టిగానే కౌంటర్లు ఇవ్వడం ఎన్నోసార్లు మైదానంలో చూసాము.


 ఇక మరోవైపు ఎప్పుడు మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దిటుగానే ఇక కప్పింపులకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరగబోతుంది. ఈ గత కొన్ని రోజుల నుంచి అటు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇరు జట్ల మాజీ ఆటగాళ్ల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి సమయంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు టీమిండియా పై ఇటీవలే ఒక షాకింగ్ కామెంట్ చేసింది.


 2020 - 21 బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఆడిలైట్ వేదికగా జరిగిన టెస్టులో ఇండియా 36 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇటీవల ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు... ఇక భారతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా.. టీమిండియా తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం సరే.. కానీ సిరీస్ సంగతేంటి అంటూ అటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా ఇక ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: