అదే సమయంలో ఎంతోమంది ప్లేయర్లు కూడా వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేసి ఎన్నో వరల్డ్ రికార్డులను కూడా ఖాతాలో వేసుకునేందుకు మరి కొంతమంది క్రికెటర్లు వేచి చూస్తూ ఉన్నారు. కాగా సౌతాఫ్రికా వేదికగా ప్రారంభం కాబోతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్లో వరల్డ్ కప్ కు ఆతిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో తలబడబోతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే అటు మహిళల టి20 వరల్డ్ కప్ లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఇక ఇప్పుడు కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గత ప్రపంచ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత మహిళల జట్టు తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడాలని భావిస్తుంది.
అదే సమయంలో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్లు సైతం ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో అన్ని జట్ల మధ్య పోరు ఎంతో హోరాహోరీగా జరగబోతుంది అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఈనెల 12వ తేదీన భారత జట్టు తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ ను ఢీకొట్టబోతుంది. ఇక ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఈ మ్యాచ్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ అధికారిగా మ్యాచ్లకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లలో అటు టీమ్ ఇండియా ప్రత్యర్ధులపై పై చేయి సాధించి అదరగొట్టింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అధికారిక మ్యాచ్ లలో ఎలా రాణిస్తుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి