
గ్రూప్ -ఎ లో టాప్ ప్లేస్ లో నిలిచిన ఆస్ట్రేలియా జట్టు.. గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన భారత జట్టు మధ్య నేడు కీలకమైన పోరు జరగబోతుంది. ఇరుజట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న నేపద్యంలో ఎవరు గెలుస్తారు అనే దానిపై కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు క్రికెట్ నిపుణులు. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగపోతుంది అన్నది తెలుస్తుంది.. అయితే ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ఐదుసార్లు టి20 వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా కొనసాగుతుంది.
అలాంటి పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అటు టీమిండియా కు ఎంతో కఠినమైన సవాలు లాంటిదే అని చెప్పాలి. అయితే ఎలాంటి గణాంకాలను ఉదాహరణగా తీసుకున్న అటు భారత్ కంటే ఆస్ట్రేలియా నే బలమైన జట్టుగా కొనసాగుతోంది. దీంతో టీమ్ ఇండియా గెలుపు కత్తి మీద సామ లాంటిది అని చెప్పాలి. అయితే భారత జట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్ లు అడుగుపెడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు భారత అభిమానులు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఉన్నారు అని చెప్పాలి.