
అయితే మొదటి రెండు మ్యాచ్లలో గెలిచిన నేపథ్యం లో అటు బ్యాటింగ్లో కొంత అస్థిరత కనిపించినప్పటికీ పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇక మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం బ్యాట్స్మెన్లు పూర్తిగా చేతులేత్తేయ్యటం.. ఒక్కరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడంతో చివరికి భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే భారత జట్టు ఓడిపోవడంపై అభిమానులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేలవ ప్రదర్శన పై విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చేసిన పని మాత్రం అభిమానుల మనసు గెలుచుకుంది అని చెప్పాలి. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూప లేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయ లేకపోయాడు అని చెప్పాలి. కానీ ఇక అతను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయం లో ఒక అభిమాని సిరాజ్ను పిలిచాడు. ఈ క్రమం లోనే సిరాజ్ ఏకం గా అభిమాని దగ్గరికి వెళ్లి తన ఎనర్జీ డ్రింక్ ను అభిమానికి అందజేసాడు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది. ఇది చూసి సిరాజ్ అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు.