బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కి ఒకదాని తర్వాత ఒకటి గట్టి  ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఐపీల్ 2023 సీజన్ ప్రారభం కావడానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చ్ 31 వ తారీఖున మొదలు కానున్న ఐపీల్ మ్యాచులకు సర్వం సిద్ధం అవుతున్న వేళా బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రం దిగాలుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ ఫెసర్ జోష్ హాజిల్ వుడ్ కి గాయం అయినా కారణంగా ఐపీల్ లో ఆడటం పై సందిగ్దత నెలకొని ఉంది. గత సీజన్ లో బెంగుళూరు తరపున హాజిల్ వుడ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇలాంటి టైం లో బెంగుళూరు టీమ్ కి బలమైన యువ అలిరౌండర్ విల్ జాక్స్ కి గాయం అయ్యిందనే వార్త ఆర్సీబీ ని మీరింత ప్రెజర్ కి గురి చేస్తుంది. విల్ జాక్స్ ని బెంగుళూరు గత వేలం లో 3.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా బంగ్లాదేశ్ ఆడుతున్న రెండవ వన్డే లో విల్ జాక్స్ లెఫ్ట్ లెగ్ కి ఇంజురీ అయ్యింది. దాంతో డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి అవసరం అని చెప్పారు. మరి ఐపీల్ కి  అందుబాటులో ఉండటం సందేహంగా ఉంది. ఇప్పటికి బంగ్లాదేశ్ తో ఆఖరి వన్డే తో పాటు సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు విల్ జాక్స్. నిజానికి విల్ జాక్స్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన t20 లీగ్ లో ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విల్ జాక్స్ తన అలిరౌండర్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. ఒకవేళ ఇటు విల్ జాక్స్ తో పాటు జోష్ ఫాజిల్ వుడ్ తప్పుకుంటే మాత్రం బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కి గట్టిగా ఎదురు దెబ్బ తగిలినట్టే. ఇలా ఇద్దరు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్న సమయంలో జట్టుకు దూరం అవ్వడం తో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ అభిమానులు కూడా ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: