గత రెండేళ్ల నుంచి కూడా టెస్ట్ ఫార్మాట్ లో మంచి ప్రదర్శన చేస్తూ వస్తున్న భారత జట్టు ఇక ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్  ట్రోఫీలో భాగంగా ఈ ఘనత సాధించింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగు పెట్టాలి అంటే నాలుగో మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా ఆస్ట్రేలియా, భారత్ మధ్య హోరహోరిగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే టీమ్ ఇండియాకు అదృష్టం వరించింది.


 ఎందుకంటే న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయింది అని చెప్పాలి. దీంతో ఇక నాలుగో మ్యాచ్ ఫలితం గురించి అవసరం లేకుండా ఇక ఎలాంటి సమీకరణాలు లేకుండానే అటు భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. కాగా జూన్ 7వ తేదీన ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఫైనల్ మ్యాచ్లో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై ఇప్పటి నుంచే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియాలో ప్రకటించడం మొదలుపెట్టారు. ఇక ఇదే విషయంపై అటు భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సైతం స్పందించాడు. డబ్ల్యూటీసి ఫైనల్ కోసం టీమిండియా కు ఒక కీలక సూచన చేశాడు. బ్యాటింగ్లో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ను తుది జట్టులోకి తీసుకోవాలి అంటూ సూచించాడు. అతను వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ గా పనికొస్తాడని.. అతను జట్టులో ఉంటే మిడిల్ ఆర్డర్  మరింత పటిష్టంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. 2021 లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ సెంచరీ చేసిన విషయాని గుర్తు చేసాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: