
అయితే కేవలం బౌలింగ్ బ్యాటింగ్ లోనే కాదు అటు ఫీల్డింగ్ లో కూడా రవీంద్ర జడేజా మించిన వారు ఇంకొకరు ఉండరేమో అనేంతలా అదరగొడుతూ ఉంటాడు. ఇప్పుడు వరకు ఎన్నోసార్లు మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు చేసి ప్రేక్షకులను ఫిదా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మెరుపు వేగంతో మైదానంలో కదులుతూ ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు రవీంద్ర జడేజా. ఇక అద్భుతమైన క్యాచ్‌లు పట్టడమే కాదు బౌండరీ లైన్ దగ్గర నుంచి నేరుగా వికెట్లను కొట్టి రన్ అవుట్ చేయడంలో కూడా జడేజా తోపు అని చెప్పాలి.
రవీంద్ర జడేజా ఫీల్డింగ్ విన్యాసాలు చూసిన తర్వాత మేము కూడా ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచుకోవాలేమో అని ఇతర ఆటగాళ్లకు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా ఫిట్నెస్ గురించి లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ప్రశంసలు కురిపించాడు అని చెప్పాలి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ప్రపంచ క్రికెట్లో అద్భుత ఫీల్డర్ ఎవరు అనే ప్రశ్న అతనికి ఎదురు కాగా.. రవీంద్ర జడేజా అంటూ టక్కున సమాధానం చెప్పేసాడు. రవీంద్ర జడేజా సూపర్ మ్యాన్ లాగా కనిపిస్తాడని అసాధ్యమైన క్యాచ్ లను కూడా అలవోకగా పట్టేస్తాడని జాంటీ రోడ్స్ ప్రశంసలు కురిపించాడు. అయితే ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్లు గా పేరున్న కోహ్లీ స్మిత్ పేర్లను మాత్రం అతను ప్రస్తావించకపోవడం గమనార్హం.