ఇండియన్ ప్రీమియర్ ప్రారంభమైంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరి లో కూడా పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పాలి. ఉత్కంఠ భరితం గా జరిగే ప్రతి మ్యాచ్ వీక్షిస్తూ అసలు సిసలైన క్రికెట్ మజాను పొందుతూ ఉంటారు. సాధారణంగానే వీకెండ్ ని ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత మాత్రం వీకెండ్ అంటే చాలు క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఏకంగా రెండు పండుగలు వరుసగా వచ్చాయేమో అన్నట్లుగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభం అయ్యాక వీకెండ్ లో శని, ఆదివారాల్లో ప్రతిరోజు రెండు మ్యాచ్లు జరుగుతాయి.



 దీంతో ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు ఇక ఇలా రెండు రోజులపాటు జరిగే నాలుగు మ్యాచ్లను కూడా వీక్షించి అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పొందుతూ ఉంటారు. కాగా నిన్న శనివారం కావడంతో మధ్యాహ్నం మూడున్నర గంటలకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఆ తర్వాత సాయంత్రం ఏడున్నర గంటలకు లక్నో, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా గుజరాత్ విజయం సాధించింది. ఇక నేడు డబుల్ ధమాకాలో భాగంగా మరో రెండు ఆసక్తికరమైన మ్యాచ్లు జరగబోతున్నాయ్ అని చెప్పాలి.



 మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అడుతు... రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలబడబోతుంది అని చెప్పాలి. ఇక సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అటు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలబడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నాలుగు జట్లు కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl