ఇక్కడ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అయినా అనుష్క శర్మకు ఇలాంటి అనుభవమే ఎదురైంది అని చెప్పాలి. విరుష్క జంట ఇటీవలే పబ్లిక్ ప్లేస్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఇక వారిని చూసేందుకు అభిమానులు అందరూ కూడా భారీగా తరలివచ్చారు అని చెప్పాలి. కానీ అభిమానుల తీరుతో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. బెంగళూరులోని ఒక ప్రముఖ రెస్టారెంట్ కు విచ్చేశారు విరుష్కా జంట. అయితే ఈ విషయం చుట్టుపక్కల ఉన్న వారికి తెలియడంతో అక్కడికి వచ్చి అందరూ గుమగుడారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున పోటీపడ్డారు.
దీంతో భోజనం ముగించుకున్న అనంతరం విరుష్క జంట బయటకు వచ్చి కారు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. ఇక భద్రత సిబ్బంది అభిమానులను నివారించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఇక ఎంతో కష్టపడి కారు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలోనే అనుష్క కారు వద్దకు వెళుతుండగా ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇక అనుష్క వెనకాలే వస్తున్న విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి