అంతర్జాతీయ క్రికెట్ తో పోల్చి చూస్తే అటు బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రూల్స్ కాస్త భిన్నంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్ లో మరింత ఉత్కంఠను పెంచే విధంగా బీసీసీఐ ఎప్పుడు రూల్స్ ని సవరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ 16వ సీజన్లో ఏకంగా వైట్ బాల్ తో పాటు నోబాల్ కి కూడా రివ్యూ తీసుకునే ఛాన్స్ ను కల్పించింది. అంతేకాకుండా ఇక మ్యాచ్ మొత్తంలో ఒక ప్లేయర్ ను ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి తీసుకొని అతనితో బ్యాటింగ్ బౌలింగ్ చేయించుకునేందుకు కూడా ఛాన్స్ కల్పించింది బీసీసీఐ.


 ఈ కొత్త రూల్ ప్రతి ఒక్కరిలో కూడా మరింత ఉత్కంఠను పెంచింది. అయితే ఇలాంటి రూల్ ఏదైనా కొత్తగా వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా జట్టుకు అవసరమైనప్పుడల్లా ఇలాంటి రూల్ ను వాడుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొత్తగా వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని ఇప్పటికే అన్ని జట్లు ప్రతి మ్యాచ్లో కూడా వినియోగించుకుంటున్నాయ్. అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో కంకషన్  సబ్ స్టిట్యూట్ అనే రూల్ ని ఎవరు వాడుకోలేదు.


 కానీ మొదటిసారి గుజరాత్ తో జరుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో మాత్రం ఇక ఈ రూల్ ని వాడుకున్నారు అని చెప్పాలి. గాయపడిన ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ స్థానంలో విష్ణు వినోద్ కంకషన్ సబ్ స్టిట్యూట్ గా బ్యాటింగ్కి దిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి కంకషన్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా విష్ణు వినోద్ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ముంబై బౌలర్ జోర్దాన్ చెయ్యి తగిలి ఇషాన్ కిషన్కు గాయం కావడంతో చివరికి అతను మైదానం వీడి వెళ్లిపోయాడు. ఇక అతను స్థానంలో విష్ణు వినోద్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్గా వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl