సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా గత కొంతకాలం నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఎన్నో రోజుల నుంచి ఇద్దరు కూడా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు. అయితే మొన్నటి వరకు తమన్నా రిలేషన్షిప్ గురించి వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని కొంతమంది అనుకున్నారు. కానీ ఇటీవల విజయవర్మతో డేటింగ్ లో ఉన్నట్లు తమన్న క్లారిటీ ఇచ్చేసింది అన్న విషయం తెలిసిందే.


 దీంతో అభిమానులందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక విజయవర్మతో డేటింగ్ మాత్రమే కాదు పెళ్లి కూడా జరిగితే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక తమన్నా డేటింగ్ గురించి గతంలో వచ్చిన వార్తలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తో తమన్నా డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వచ్చాయి అని చెప్పాలి. అయితే ఈ వార్తలు ఊరికే రాలేదు. తమన్నా విరాట్ కోహ్లీ కలిసి ఒక వానిజ్య ప్రకటనలో నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. ఆ తర్వాత వీరిద్దరూ ఎన్నో రోజులపాటు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయ్.



 అయితే తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని కేవలం వాణిజ్య ప్రకటన సమయంలో మాత్రమే సరదాగా మాట్లాడుకున్నామని.. అప్పటి నుంచి ఒకరికి ఒకరం టచ్ లో లేము అంటూ తమన్న ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తమన్నా వాణిజ్య ప్రకటనలో నటించింది అన్న విషయమే తప్ప.. ఆ ప్రకటన ఏంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ యాడ్ కి సంబంధించిన వీడియో చూస్తే మాత్రం తమన్నా విరాట్ కోహ్లీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ యాడ్ చూశాక నిజంగానే అప్పట్లో తమన్నా విరాట్ కోహ్లీ మధ్యలో డేటింగ్ నడిచే ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారూ నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: