ఇలాంటి సమయంలో ఇక ఐసిసి వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పటిష్టమైన టీంను ఎంపిక చేసే పనిలో పడ్డాయి అన్ని దేశాలు క్రికెట్ బోర్డులు. అయితే ఇక అటు బంగ్లాదేశ్ కూడా పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగడానికి సిద్ధమయింది. ఇలాంటి సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ప్లేయర్ వరల్డ్ కప్ కి ముందు ఇక రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. ఇక అతని రిటైర్మెంట్ తో సహచర ఆటగాళ్ళే కాదు అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే ఇలా రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెటర్ తమీం ఇగ్బాల్ ఇటీవల రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు.
అయితే తమిళ్ ఇక్బాల్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఎలా ఆడుతుందో అని అభిమానులు ఆందోళన చెందగా స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి నుండి తమిమ్ ఇక్బాల్ కు పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే ఇక రిటర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ ఆమె కోరారు. అయితే ఇటీవలే రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న తమిమ్ ఇక్బాల్.. గౌరవనీయులైన ప్రధానమంత్రి కి నో చెప్పలేను అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకోచ్చారు. అయితే మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ ఉందనంగా తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ప్రధాని షేక్ హసీనా సూచనతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. కాగా అతను మరో నెలపాటు విశ్రాంతి తీసుకుని ఆసియా కప్ నుంచి ఇక జట్టులో చేరే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి