హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. 2022 ఐపీఎల్ సమయంలో జరిగిన మెగా వేలంలో ఎలాంటి అంచనాలు లేకుండానే ముంబై ఇండియన్స్ జట్టులో అడుగుపెట్టాడు. అదృష్టవశాత్తు తుది జట్టులో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు. 2022 ఐపీఎల్లో అటు ముంబై ఇండియన్స్ జట్టు ఎంత దారుణమైన వైఫల్యాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ముంబై ఇండియన్స్ మొత్తం దారుణంగా విఫలమవుతున్న సమయంలో.. అటు హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లోను నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు తిలక్ వర్మ. కాగా ఇలా జట్టులో కీలక ప్లేయర్గా మారిన తిలక్ వర్మ ఇంటికి ముంబై టీం మొత్తం వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ తో హైదరాబాద్ వేదిక మ్యాచ్ జరిగిన సమయంలో ఇక ముంబై టీం మొత్తం హైదరాబాద్ లో ఉన్న తిలక్ వర్మ ఇంటికి వెళ్లారు.


 ఇలా ముంబై ఇండియన్స్ టీం మొత్తం ఇంటికి వచ్చి ఎలా గడిపారు అనే విషయం గురించి తిలక్ వర్మ తండ్రి నాగరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ సతీమణి రితిక అన్నమాట ఇప్పటికి మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చారు. రోహిత్ భార్య మా ఇంటికి రాగానే ఇంట్లో వాళ్లతో కలిసి పోయారు. మా పెట్ డాగ్తో ఆడుకున్నారు. సూర్యకుమార్ భార్య కూడా సరదాగా గడిపారు. అయితే ఇద్దరు కిందనే కూర్చున్నారు. నేను వెంటనే కింద ఎందుకు కూర్చున్నారు రితికా.. వద్దు అని అన్నారూ. అందుకు ఆమె చెప్పిన మాట జీవితాంతం మర్చిపోలేను. నేను సోఫా మీద కూర్చుంటే ఇది మీ ఇల్లు అవుతుంది. అదే నేను కింద కూర్చుంటే మన ఇల్లు అవుతుంది కదా అంటూ ఎంతో హుందాగా మాట్లాడారు అంటూ తిలక్ వర్మ తండ్రి నాగరాజు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: