బాబర్‌ ఆజమ్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయంలో బాబర్‌ ఆజమ్‌ వార్తల్లో ఉంటాడు. అయితే ఇప్పుడు అనామక బౌలర్ చేతిలో అవుట్ అయ్యి చేతులెత్తేశాడు. లంక ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌ జులై 30 న విడుదలైంది. తోలి మ్యాచ్ లో జాఫ్నా కింగ్స్‌, కొలొంబో స్ట్రయికర్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో జాఫ్నా కింగ్స్‌ 21 పరుగుల తేడాతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే . ఇక మ్యాచ్ విషయంలోకి వెళ్తే..టాస్‌ ఓడి బ్యాటింగ్ కు దిగిన జాఫ్నా కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వీరి ఇన్నింగ్స్ లో తౌహిద్‌ హ్రిదోయ్‌ అర్ధసెంచరీతో రాణించాడు. నిషాన్‌ మధుష్క, గుర్భాజ్‌, అసలంక, ప్రియమల్‌ పెరీర భారీ స్కోర్ లుగా మలచలేకపోయారు. అయితే ఆఖర్లో దునిత్‌ వెల్లలగే (25 నాటౌట్‌), కెప్టెన్‌ తిసార పెరీరా (14 నాటౌట్‌) వేగంగా ఆడి మంచి స్కోర్ ని బోర్డు మీద పెట్టారు.  కొలొంబో బౌలర్లలో నసీం షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్‌ తలో వికెట్‌ తీసి భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసారు.

ఇక 174 టార్గెట్ తో బరిలోకి దిగిన కొలొంబో 152 పరుగులకే చేతులెత్తేసింది. విజయకాంత్‌ వియాస్‌కాంత్‌ (4-0-17-2)  మాయాజాలం ధాటికి 19.4 ఓవర్లలోనే కుప్పకూలింది. దీంతో జాఫ్నా కింగ్స్‌ 21 పరుగుల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. విజయకాంత్‌తో పాటు హర్దుస్‌ విల్జోయెన్‌ (3/31), దిల్షన్‌ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించారు. మొదటి మ్యాచ్ లోనే భారీ అంచనాలతో వచ్చిన కొలొంబో స్ట్రయికర్స్‌ చేతులెత్తేసింది. కెప్టెన్ నిరోషన్‌ డిక్వెల్లా ఒక్కడే అర్థ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న బాబర్ ఆజమ్ 7 పరుగులు మాత్రమే చేసాడు. పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన ఆజమ్, ఆ తరువాత క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా చేతులెత్తేయడంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. అయితే బాబర్ ఆజమ్ ఒక అనామక కుర్రాడు చేతిలో క్లీన్ బౌల్డ్ అవ్వడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: