అయితే ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు మెగా టోర్నీలపై మరోసారి కరోనా ప్రభావం చూపబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం అవును అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ప్రస్తుతం ఆసియా కప్ కు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిధ్యం ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 30వ తేదీ నుంచి టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 17వ తేదీన జరుగుతుంది అని చెప్పాలి. అయితే శ్రీలంక వేదికగానే భారత్, పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ కూడా జరగబోతుంది.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇది క్రికెట్ లవర్స్ అందరిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ఆసియా కప్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు శ్రీలంక శిబిరం నుంచి ఒక పెద్ద వార్త బయటకి వచ్చింది. ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకిందట. అవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా ఇలా వైరస్ బారిన పడ్డారట. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇద్దరు ప్లేయర్స్ కరోనా వైరస్ బారిన పడితే ఇక టోర్నీ ప్రారంభమయ్యాక స్టేడియం నిండా ప్రేక్షకులను నిండిపోయాక.. వైరస్ వ్యాప్తి ఎంత ఉంటుందో అని అందరు భయపడిపోతున్నారు. ఇలా అయితే టోర్నీ సవ్యంగా నిర్వహించడం కష్టమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి