
సూపర్ 4లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లతో సత్తా చాటాడు ఈ భారత్ స్పిన్నర్. ఇక శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లోను నాలుగు వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియా గెలుపులో కీలకపాత్ర వహించాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ లోను కుల్దీప్ పై టీమిండియా భారీగానే అంచనాలు పెట్టుకుంది అని చెప్పాలి. కాగా సెప్టెంబర్ 22వ తేదీ నుంచి టీమ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగబోతుంది. కాగా కుల్దీప్ యాదవ్ గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టుకి ట్రంప్ కార్డు లాంటి ఆటగాడు కుల్దీప్ యాదవ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలో అతనితో కొంత సమయం గడిపాను. ప్రత్యేకమైన స్కిల్ సైట్ ఉన్న బౌలర్ అతను. ప్రతి ప్లేయర్ పై నమ్మకం ఉంచాలి. టీమిండియా మేనేజ్మెంట్ అలాగే చేసింది. అయితే ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. అతడే మాకు ట్రంప్ కార్డు. చాలా జట్లు కుల్దీప్ బౌలింగ్లో ఆడటాన్ని కష్టంగా భావిస్తున్నాయి. మునుమందు ఏం జరుగుతుందో చూసేందుకు ఉత్సాహంగానే ఉన్నా అంటూ అజిత్ అగర్కర్ తెలిపాడు. కాగా ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ లో వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లకు కుల్దీప్ కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కుల్దీప్ తో పాటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.