
ఎంతటి పటిష్టమైన టీం అయినా సరే టీమ్ ఇండియాతో సొంత గడ్డపై తలబడటానికి భయపడిపోతూ ఉంటుంది. అందుకే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా టీమిండియా బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ లో టైటిల్ విజేతగా నిలిచింది టీమ్ ఇండియా. ఇక ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లోను గెలుపొందింది టీమిండియా. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ కూడా గెలవడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై కూడా మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఈ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ప్లేయింగ్ ఎలవెన్ లో సూర్య కుమార్ యాదవ్ కు చోటు దక్కకపోవచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ మినహా సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివరి ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ మాత్రమే కాదు ఇషాన్ కిష,న్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు కూడా బాగా ఆడగలరు. ఇక నాలుగవ స్థానంలో ఎలాగో శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు ఒకవేళ అతని స్థానంలో సూర్యకి ఛాన్స్ వస్తే సెంచరీ చేసి సూర్య తనని తాను నిరూపించుకోవాలి అంటూ సూచించాడు సునీల్ గవాస్కర్.