ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ మహాసంగ్రామానికి వేలైంది. రేపటి నుంచే ఈ వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ ప్రేక్షకులందరికీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడం పక్క అని అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.


 అదే సమయంలో ఇక ఈ వరల్డ్ కప్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా మాజీ ప్లేయర్లు ఇస్తున్న రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఎక్కువ పరుగులు చేసే బ్యాట్స్మెన్ ఎవరు అనే విషయంపై కొంతమంది స్పందిస్తూ ఉంటే.. ఎక్కువ వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను దెబ్బ కొట్టే బౌలర్ ఎవరు అనే విషయంపై ఇంకొంతమంది మాజీ ప్లేయర్లు స్పందిస్తున్నారు అని చెప్పాలి. ఇదే విషయం గురించి దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ స్టేయిన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 రేపటి నుంచి ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టిస్తాడని.. దక్షిణాఫ్రికా మాజీ స్టేయిన్ అభిప్రాయపడ్డాడు  ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఈ స్టార్ బౌలర్.. వరల్డ్ కప్ లోను అదే ఫామ్ ను కొనసాగిస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. అయితే గత రెండు వరల్డ్ కప్ టోర్నీలలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్టులో స్టార్క్ 49, బౌల్ట్ 39, శమీ 31 తో టాప్ త్రీ లో ఉన్నారు అని చెప్పాలి. మరి ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్ లో ఏ బౌలర్ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc