మొన్నటి వరకు వరుస విజయాలు సాధించి తప్పకుండా వరల్డ్ కప్ సెమీఫైనల్ లో చోటు సంపాదించుకుంటాయి అని అందరూ నమ్మకం పెట్టుకున్న టీమ్స్.. ఇప్పుడు వరుస పరాజుయాలతో సతమతమవుతున్నాయ్. అదే సమయంలో పాయింట్ల పట్టికలో చివరన ఉన్న జట్లు మాత్రం ఇతర జట్ల ఓటములతో అంతకంతకు పైకి దూసుకుపోతూ ఇక సెమి ఫైనల్లో చోటు సంపాదించుకునేలాగే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు మాజీ ఆటగాళ్లు సెమీఫైనల్ లోకి చేరుకోబోయే జట్లు ఏవి అనే విషయంపై ఇస్తున్న రివ్యూలు కూడా తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.
ఇకపోతే ఇటీవల ఇదే విషయం గురించి సౌతాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కలీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ లో ఫైనల్ చేరబోయే జట్లను అంచనా వేశాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ చూస్తుంటే.. ఫైనల్లో తప్పకుండా ఇండియా, సౌత్ ఆఫ్రికా తలబడతాయి అనిపిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ట్రోఫీ గెలిచే అవకాశాలు ఇండియాకే ఎక్కువగా ఉన్నాయి అంటూ తెలిపాడు. కాకపోతే ఆతిథ్యం ఇస్తున్న కారణంగా ఆ టీమ్ ఇండియా పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ సేన బాగుంది. కానీ సెమీఫైనల్ లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రెండు టీమ్స్ కి ఆస్ట్రేలియా నుంచి ముప్పు పొంచి ఉంది అంటూ కలిస్ అంచనా వేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి