టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవీంద్ర జడేజా. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉంటూ అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. తన బౌలింగ్ తో ఎప్పుడు బౌలర్లను తికమక్కపెట్టి  వికెట్లు దక్కించుకునే రవీంద్ర జడేజా ఇక మైదానంలో ఫీల్డింగ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇక బ్యాటింగ్లో అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కీలకమైన సమయంలో క్రీజు లోకి వచ్చి మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు రవీంద్ర జడేజా.

 అయితే ఇలా భారత జట్టులో కీలకమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న జడేజా అటు ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ ఆ టీమ్ లో కీలక ప్లేయర్గా ఉన్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత జట్టులో ఆ రేంజ్ క్రేజ్ కలిగిన ప్లేయర్గా జడేజా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ కూడా అందుకొని హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే రవీంద్ర జడేజా క్రికెట్ రూల్స్ ని తూచా తప్పకుండా పాటిస్తూ తన ఆటను కొనసాగిస్తూ ఉంటాడు.


 అలాంటి జడేజా ఐపీఎల్ లో 2010లో రూల్స్ ఉల్లంఘించినందుకు ఏకంగా టోర్నీలో ఆడలేకపోయాడు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జడేజా మొదటి రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అయితే 2010 ఐపీఎల్ లో మాత్రం టీం మారేందుకు ముంబై ఇండియన్స్ తో చేర్చారు జరిపాడు. దీంతో ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ నిర్దేశించిన మార్గదర్శకాలను జడేజా ఉల్లంఘించినట్లు అయింది. ఇక ఈ విషయంపై అటు ఐపీఎల్  గవర్నమెంట్ కౌన్సిల్ సీరియస్ గా స్పందించింది. ఇలాంటివి సహించబోమని.. అతనికి భారీ జరిమాన విధించారు. అయితే మా ఐపిఎల్ సీజన్ లో ఏ టీం కూడా అతని జట్టులోకి తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: