ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. అంతకుముందు ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన బాధ నుంచి ఇక క్రికెట్ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కాస్త ఉపశమనం పొందే విధంగా టి20 సిరీస్ లో అటు భారత జట్టు ప్రస్థానం కొనసాగిస్తుంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్ ప్లేయర్లందరికీ కూడా విశ్రాంతి ప్రకటించగా.. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్స్ తో కూడిన టీమిండియా అటు ఆస్ట్రేలియా తో తలబడుతుంది అని చెప్పాలి.


 ఎంతో అనుభవం గల ప్లేయర్స్ తో నిండిన ఆస్ట్రేలియా తో సూర్య సేన తలబడి నిలబడటం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత జట్టు ప్రస్థానం కొనసాగుతుంది అని చెప్పాలి. ఏకంగా వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన భారత జట్టు మూడో మ్యాచ్లో మాత్రం పరాజయం పాలయింది. ఇక ఆ తర్వాత నాలుగో టి20 మ్యాచ్ లో అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది అని చెప్పాలి. కాగా నేడు ఐదవ టి20 మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. వాస్తవానికి ఈ టి 20 మ్యాచ్ హైదరాబాద్ వేదిక జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో ఇక ఈ మ్యాచ్ వేదికను మార్చారు. అయితే ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ గెలిచిన సూర్య కుమార్ సేన.. ఇక మరో గెలుపుతో సిరీస్ ఆదిక్యాన్ని  పెంచుకోవాలని భావిస్తుంది. ఇక మరోవైపు ఈ సిరీస్ లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా.. చివరి మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. కాగా నేడు జరగబోయే ఐదవ టి20 మ్యాచ్లో హోరాహోరీ పోరు జరగడం ఖాయం అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: