
ఇలాంటి మెరుపులు చాలానే చూసాం. ఇలాంటి బ్యాటింగ్ మెరుపులు కొన్నాళ్లు మాత్రమే ఉంటాయి. ఇక ఆ తర్వాత అందరిలాగానే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడటం ఖాయమని అందరూ అనుకుంటే ఇక అందరి ఆలోచన కరెక్ట్ కాదు అన్న విషయాన్ని తన బ్యాటింగ్తో నిరూపిస్తున్నాడు. టీమిండియా తరఫున కూడా అదే రీతిలో సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్ లు ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో 29 బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో 46 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే ఇటీవల తన పవర్ హిట్టింగ్ రహస్యాలను బయటపెట్టాడు. జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ తనకు భారీ షాట్లు ఆడే శక్తిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చివరి ఓవర్లలో తన మనస్సును ప్రశాంతంగా ఉంచుతూ బ్యాటింగ్ చేయగలిగినందుకు.. ఐపీఎల్ కు క్రెడిట్ ఇచ్చాడు ఈ పవర్ హిట్టర్. జిమ్ కి వెళ్తాను. మంచి ఆహారం తింటాను. నాకు బరువులు ఎత్తడం అంటే చాలా ఇష్టం. ఇది నాకు సహజసిద్ధమైన శక్తిని ఇచ్చింది అంటూ తెలిపాడు రింకు సింగ్. అయితే రింకు సింగ్ సూపర్ ఫాస్ట్ ఇన్నింగ్స్లను చూసిన తర్వాత భారత జట్టును ఎన్నో రోజులుగా వేధిస్తున్న ఫినిషిర్ సమస్య తీరిపోయింది అని అభిమానులు అనుకుంటున్నారు.