సాధారణంగా అయితే రోహిత్ ఇక ఐదు సార్లు టైటిల్ అందించి ఇక జట్టును ఛాంపియన్ టీం గా నిలిపిన నేపథ్యంలో ఇక అతను రిటైర్మెంట్ ప్రకటించేంతవరకు కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గానే కొనసాగించే అవకాశం ఉందని.. ఐదు టైటిల్స్ అందించినందుకు గాను ఆ ఫ్రాంచేసి రోహిత్ కు ఆ గౌరవం ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో అర్ధాంతరంగా అతన్ని సారధ్య బాధ్యతల నుంచి తప్పించింది. కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించింది. ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో రోహిత్ అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే రోహిత్ శర్మ అభిమానులందరూ కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను సారధ్య బాధ్యతలనుంచి తప్పించడం ఏంటి అని సోషల్ మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఇకనుంచి ముంబై ఇండియన్స్ కి మద్దతు తెలుపబోము అంటూ సోషల్ మీడియా ఖాతాలను కూడా అన్ ఫాలో చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తొలగించిన నేపథ్యంలో.. ఎంతో మంది రోహిత్ సహచర ఆటగాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా వైరల్ గా మారిపోతున్నాయి. ఇక కెప్టెన్సీ మార్పు తర్వాత సూర్య కుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ సింబల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారత స్పిన్నర్స్ చాహల్ తన సోషల్ మీడియా ఖాతాలో డిపి ని మార్చారు. రోహిత్ తో ఉన్న ఫోటోని ఆయన పోస్ట్ చేశాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చాహల్ తన డిపి ని మార్చడానికి కారణం రోహిత్ కు మద్దతు పలకడమే అని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి