వరల్డ్ క్రికెట్ లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇలాంటి స్టార్ ప్లేయర్లలో క్రికెట్ రూల్స్ పై ఎక్కువ అవగాహన ఉన్న ప్రేయర్ ఎవరు అంటే మాత్రం భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ముందుగా అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ తమిళ తంబి ఏకంగా క్రికెట్లో ఉన్న ప్రతి రూల్ ని అవపోసన పట్టాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి కనీసం ఆలోచనలో కూడా లేని రూల్స్ ని అతను ఫాలో అవుతూ ఏకంగా ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. గతంలో  మన్ కడింగ్ అవుట్, ఐపీఎల్లో ఫస్ట్ రిటైర్డ్ హార్డ్ లాంటి వినూత్నమైన రూల్స్ ను ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా గుర్తు చేశాడు.


 ఇలా ఏకంగా క్రికెట్లో ఉన్న రూల్స్ ప్రకారం అశ్విన్ ఏం చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటాడు అని చెప్పాలి. కొంతమంది అతనికి క్రీడా స్ఫూర్తి లేదు అని విమర్శిస్తున్న.. అతను ఐసీసీ పెట్టిన రూల్స్ ప్రకారమే చేస్తున్నానని సమాధానం చెబుతూ.. తనని తాను ఎప్పుడు సమర్పించుకుంటూ ఉంటారు. అయితే ఇలా క్రికెట్ లోని రూల్స్ అన్నింటినీ కూడా అవపోసన పట్టిన రవిచంద్రన్ అశ్విన్.. ఇక ఇటీవలే ఇంగ్లాండ్తో జరుగుతూన్న రెండో టెస్టులో ప్రముఖ అంపైర్ మారియర్స్ ఏరాస్మస్ తో వాగ్వాదానికి దిగాడు. ఎప్పుడు కూల్ గా ఉంటూ తన పని కానీచ్చే అశ్విన్.. వాగ్వాదానికి దిగాల్సిన అవసరం ఏంటి అని చర్చ మొదలైంది.


 భారత ఇన్నింగ్స్ సమయంలో ఎరాస్మస్ తో అశ్విన్ చర్చకు దిగాడు. దీంతో కెమెరాల ఫోకస్ మొత్తం అతనిపై పడింది. ఇక ఏదో విషయంపై సీరియస్ గానే చర్చించాడు అని చెప్పాలి. కొన్ని క్షణాల తర్వాత సీరియస్ గా అక్కడి నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సైంటిస్ట్ అశ్విన్.. ఎంపైర్ ఎరాస్మస్ తో క్రికెట్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎరాస్మస్ అశ్విన్ మరో ఓవర్ బ్యాటింగ్ చేయాల్సిందిగా అడిగాడు. అందుకే అశ్విన్ ఇలా కోప్పడుతున్నాడు అంటూ ఎంతోమంది ఇక ఈ ఫోటో చూసిన తర్వాత ఫన్నీ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: