సాధారణంగా క్రికెట్లో ఎంత గొప్ప ఆటగాడికి అయినా సరే ఏదో ఒక దశలో రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పటివరకు ఇక ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ తరఫున మూడు ఫార్మాట్లలో రాణించిన ఆటగాళ్లు వయస్సు పెరిగిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఆటకు వీడ్కోలు పలకడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత తమకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కి ఏదో రూపంలో దగ్గరగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాగా కొంతమంది కోచ్ లుగా మారితే.. ఇంకొంతమంది కామెంట్రేటర్లుగా మారడం చూస్తూ ఉంటాం.



 అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీడ్కోలు విషయంలో యూటర్న్ తీసుకోవడం చేస్తూ ఉంటారూ అని చెప్పాలి. ఇక ప్రకటించిన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని.. మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆటను కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక శ్రీలంక క్రికెటర్ కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. కానీ అంతలోనే యూటర్న్ తీసుకున్నాడు రిటైర్మెంట్ విషయంలో వెనక్కి తగ్గాడు. తన వీడ్కోలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ అంతలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది.



 రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న సదరు క్రికెటర్ ఫై ఏకంగా బ్యాన్ విధించింది ఐసీసీ. ఇటీవల టెస్ట్ క్రికెట్ రిటర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగా. అతనికి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న తర్వాత ఆడబోయే  తొలి రెండు టెస్టులకు అతనిపై నిషేధం విధించింది. ఈనెల 18వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో అతను అంపైర్ల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ 3 డి మెరిట్ పాయింట్స్ లతోపాటు.. రెండు టెస్టులపై నిషేధం విధించింది అని చెప్పాలి. దీంతో బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు హసరంగ దూరం కాబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl