ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఈ ఏడాది జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 ప్రపంచ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు అన్ని టీమ్స్ కూడా వరల్డ్ కప్ టైటిల్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాయ్. ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. తమ అత్యుత్తమ జట్టును బరిలోకి దింపేందుకు అన్ని ఫ్రాంచైజీలు కూడా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ప్రపంచ కప్ టైటిల్ వేటలో అంతకంతకు వెనకబడిపోతున్న టీమిండియా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది.



 ఈ క్రమంలోనే పటిష్టమైన టీం తో బరిలోకి దిగేందుకు రెడీ అవుతుంది అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ఎన్నో రోజుల నుంచి రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్న కొంతమంది ఆటగాళ్ళను తప్పకుండా వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలి అంటూ సూచనలు కూడా చేస్తూ ఉన్నారు మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోని ఇదే విషయం గురించి వెస్టిండీస్ దిగజం బ్రియాన్ లారా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 ప్రపంచ కప్ టోర్నీలో సంజు శాంసన్, రిషబ్ పంతులు ఇద్దరు కూడా టీమిండియాలో ఉండాల్సిందే అంటూ అభిప్రాయపడ్డాడు లారా. కీపింగ్ కు భారత జట్టులో పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా కేవలం ఒకరిని ఎంపిక చేయాలా అనే ప్రశ్నపై స్పందించిన  లారా ఆసక్తికర సమాధానం చెప్పాడు. వాళ్ళిద్దరిలో ఒకరిని కాదు ఇద్దరినీ కూడా జట్టులోకి తీసుకోవాలి. ఈ ఐపిఎల్ సీజన్లో వాళ్ళిద్దరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. సంజూ  టైమింగ్ రిషబ్ పంత్ ఫామ్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ లారా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: