సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఏ రేంజిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇక స్టార్ క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అదే క్రికెటర్ల ప్రేమ పెళ్లి వ్యవహారాలు అయితే మరింతగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసా ఒక మహిళ క్రికెటర్ పెళ్లి చేసుకుంది. ఏకంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అయింది. దీంతో ప్రస్తుతం ఇక ఈ పెళ్లి గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అదేంటి ఇక మహిళా క్రికెటర్ కు పెళ్లి కావడం సర్వసాధారణమే. కొంతమంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇందులో పెద్దగా చర్చించుకోవడానికి ఏముంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఆ మహిళా క్రికెటర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది పురుషుడిని కాదు ఏకంగా మరో మహిళనే. వినడానికే షాకింగ్ గా ఉంది కదా.. కానీ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఇదే చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న ఉమెన్ క్రికెటర్ యాష్లే గార్డినర్  తన స్నేహితురాలు మోనికా రైట్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన నిశ్చితార్థ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే 2017 నుంచి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ లివింగ్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారు. ఇటీవలే వారి బంధానికి ఇక ప్రమోషన్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. కాగా యాష్లే గార్డ్ నర్ ఆస్ట్రేలియా జట్టులో బౌలింగ్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: