బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచ క్రికెట్లో ఎంత ప్రత్యేకమైన క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక సాదా  టి20 టోర్నీగా ప్రారంభమైన ఐపీఎల్ ఏకంగా వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతూ ఉంది. ప్రతి ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కడ కనిపించని కొన్ని రూల్స్ అటు ఐపీఎల్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి రూల్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్న రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఆటగాడు ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం ప్రతి టీం కూడా మ్యాచ్ మధ్యలో ఒక ప్లేయర్ ను మరో ప్లేయర్ తో స్వాప్ చేయడానికి అవకాశం ఉంటుంది  ఇలా సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి కూడా వీలుంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఐపీఎల్ లో ఇలాంటి రూల్ వినియోగించుకుంటున్న అన్ని టీమ్స్ కూడా ప్రతి మ్యాచ్ లో భారీగా స్కోర్లు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.  మరోవైపు ఈ రూల్ కారణంగా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.


 అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై రాజస్థాన్ రాయల్స్ కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగానే ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి అనుకోవడానికి లేదు అంటూ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్ లేకపోయినా భారీ స్కోర్లు నమోదు అయ్యేది. బ్యాట్స్మెన్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారు. ఎక్కడైనా సరే పిచ్ ప్రామాణికంగానే తయారు చేస్తారు  అందుకే బౌలర్లు సైతం బ్యాటింగ్ స్కిల్స్ పై దృష్టి సారించాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా మ్యాచ్ సాగిపోతుంది అంటూ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: