ఎప్పుడూ అంచనాలకు మించి రానించే పాకిస్తాన్ జట్టు ఇక వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్లో కూడా అదే రీతిలో ప్రదర్శన చేసింది. ఎందుకంటే ఈసారి తప్పకుండా టైటిల్ గెలుస్తుంది ఆ దేశ అభిమానులు అందరూ కూడా అంచనాలు పెట్టుకుంటే.. అంచనాలన్నింటినీ కూడా తారుమారు చేస్తూ చివరికి చెత్త ప్రదర్శన చేసింది. ఎంతలా అంటే చిన్న దేశమైన అమెరికా జట్టు చేతుల్లో కూడా ఓడిపోయి చివరికి దారుణమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది. కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టలేక లీగ్ దశతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.


 అయితే ఇలా t20 వరల్డ్ కప్ లో  లీగ్ దశతోనే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు ఇక అభిమానుల ఆగ్రహానికి భయపడి కనీసం సొంత దేశానికి కూడా వెళ్లలేదు. నేరుగా యూకే కి చేరుకున్న పాకిస్తాన్ ఆటగాళ్లు అక్కడ లీగ్ క్రికెట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే.  ఇలా పాకిస్తాన్ జట్టు ఘోర వైఫల్యం పై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్లో క్రికెట్ వైభవం రోజురోజుకు తగ్గిపోతుంది అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే ఇలా పాకిస్తాన్ వైఫల్యంపై ఆ దేశ మాజీ క్రికెటర్ అతిక్ జమాన్ సైతం స్పందించారు.


 అమెరికాకు తమ దేశ ఆటగాళ్లు క్రికెట్ ఆడటానికి వెళ్లినట్లు లేదని.. ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేసేందుకు వెళ్లినట్లు ఉంది అంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు అతిక్ జమాన్ మండిపడ్డాడు. వారు క్రికెట్ ఆడుతున్నట్లు డ్రామా చేశారు. క్రికెట్ టూర్లకి ఫ్యామిలీని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి.. జట్టులో ఎవరికీ క్రమశిక్షణ లేదు. 17 మంది ప్లేయర్లకు ఏకంగా 60 రూములు బుక్ చేశారు. వాళ్ళు క్రికెట్ ఆడటానికి కాదు పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది అంటూ అతిక్ జమాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక మరికొంతమంది మాజీలు సైతం ఇలాగే పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై తీవ్రస్థాయిల విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: