అయితే ఐపిఎల్ లో ఉన్న అన్ని టీమ్స్ ఇప్పటివరకు తమ కెప్టెన్లను మార్చుతూ వచ్చాయి. కానీ అటు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాత్రం ధోనిని సారాధ్య బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పించలేదు. ధోని కూడా తన సారథ్యంతో ఎప్పుడు ఆ జట్టుని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని.. ధోని అంటే సీఎస్కే అనే విధంగా మారిపోయింది. ఇక ధోని లేని చెన్నై జట్టును అభిమానులుఅసలు ఊహించలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ధోని బాగా రాణించకపోయినా అటు చెన్నై జట్టు యాజమాన్యం కూడా ధోనిపట్ల అతని సారథ్యం పట్ల ఎంతో గౌరవం చూపిస్తూ ఉంటుంది.
కానీ వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మొదట జట్టులోకి ధోనిని తీసుకోవాలని అనుకోలేదట. ఐపీఎల్ ప్రారంభమైన 2008 సీజన్లో వేలంలో భారత క్రికెట్ దిగ్గజం ధోనిని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్ ను సిఎస్కే తీసుకోవాలని అనుకుంది అంటూ ఆ జట్టు మాజీ ప్లేయర్ బద్రీనాథ్ చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే సెహ్వాగ్ ఢిల్లీ నుండి ఆఫర్ లెటర్ తీసుకున్నారు. దీంతో ఇలా అనుకోకుండా ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకున్నారు. ఇలా ధోనినే జట్టులోకి తీసుకునేందుకు వీబి చంద్రశేఖర్ దే కీలక పాత్ర అంటూ చెప్పుకొచ్చాడు బద్రీనాథ్. కాగా గత ఏడాది ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని 2025 సీజన్లు ఆడతాడా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.