మన భారతీయ టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ అరుదైన రికార్డును శుబ్‌మ‌న్ గిల్‌ సాధించాడు .. ఇంగ్లాండులోని ఎడ్జ్‌ బాస్టన్‌ మైదానంలో తొలిసారి టీమ్ ఇండియాకు అరుదైన టెస్ట్ విజయాన్ని అందించాడు .. అలాగే బ్యాటర్ గాను అద్భుతమైన ఇన్నింగ్స్ తో మేపించాడు .. కెప్టెన్ గా రెండో ప్రయత్నం లోనే భారీ విజయంతో తన సత్తా చూపించాడు.  అయితే ఈ క్రమంలోనే 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌ పై ప్రశంసల వర్షం కురుస్తుంది .. కెప్టెన్ గా ఇతనేంటి ? అన్న వారికి ఈ గొప్ప విజయంతో గట్టి సమాధానమిచ్చాడు అంటూ మాజీ క్రికెటర్లు ఈ యువ కుర్రాడుని పొగుడుతున్నారు .. అంతా బాగానే ఉన్నా టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ వివరించిన తీరు అతడిని కొంత చిక్కుల్లో పడేసేలా చేసింది .


టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ తో ఏడ్జ్‌ బాస్టన్‌ వేదికగా రెండో టెస్ట్ ఆడిన విషయం తెలిసిందే .  ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 269 డబల్ సెంచరీ తో చెలరేగాడు గిల్ .. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో కూడా 161 పరుగులతో సెంచరీ దాటాడు ఈ రెండు ఇన్నింగ్స్ లోను తాను అవుట్ అయిన కొద్దిసేపటికి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటన ఇచ్చేశాడు ..  డ్రెస్సింగ్ రూమ్ బయటకు వచ్చి అప్పటికి క్రీజులో ఉన్న రవీంద్ర జటేజ , వాషింగ్టన్ సుందర్‌ల‌ను వెనక్కి రావాల్సిందిగా గిల్ తన రెండు చేతులతో సైగలు చేశాడు .. అయితే ఈ సందర్భంగా అతను తన జెర్సీ తీసేసి నార్మల్ దుస్తులతో దర్శనమిచ్చాడు .. అయితే అవి నైక్‌ బ్రాండ్ కు సంబంధించినవి . ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి .  ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు గిల్‌ వ్యవహార శైలిపై విమర్శిస్తూ అతనితో పాటు బీసీసీఐ అని కూడా చిక్కుల్లో పడేసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ..


ఆస‌లు మేటర్ ఏమిటంటే బీసీసీఐ అఫీషియల్ కిట్‌ స్పాన్సర్ అడిడాస్ అన్న విషయం తెలిసిందే .. అందుకుగాను టీమిండియా పురుషుల జట్టు జెర్సిల‌ను లు, కీట్లు రూపొందించేందుకు బీసీసీఐ తో భారీ మొత్తాన్ని ఆడిడాస్‌ 2023లో ఐదుశ్ల‌కు ఒప్పందం కుదుర్చుకుంది .. అయితే ఆ బ్రాండ్ కు కాంపిటేటర్ అయిన మరో బ్రాండ్ డ్రెస్ ధరించి గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం .. ఎంతో వైరల్ కావడంతో చట్టపరంగా బోర్డుకు అతనికి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా నేటిజన్లు చెబుతున్నారు ..  ఇదే క్రమంలో మరికొంతమంది ఓ అడుగు ముందుకు వేసి .. నువ్వు ఇప్పుడు కెప్టెన్ వి భయ్యా .. ఆచి తుచి నడుచుకోవాలి .. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు అంటూ గిల్‌పై విమర్శలు చేస్తున్నారు .. కాగా ఐదు మ్యాచ్లు సిరీస్ లో భాగంగా భారత్ , ఇంగ్లాండ్ మధ్య మూడో మ్యాచ్ జూలై 10 - 14 మధ్య లార్డ్స్ లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది .



మరింత సమాచారం తెలుసుకోండి: